ఇదివరకూ ఏ దర్శకుడూ చూపించాలి అనుకోని వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ ని తీసుకొని దానికి 1940 టైమ్స్ లవ్ స్టొరీ ని మిక్స్ చేసి చెప్పిన కథే కంచె. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ ని సినిమాగా చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు క్రిష్. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంశలతో పాటు, తెలుగు సినీ అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. మొదటి వీకెండ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇలాంటి ఓ డిఫరెంట్ అటెంప్ట్ ని కూడా బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపాలని కంచె టీం సక్సెస్ టూర్ ని నిర్వహిస్తున్నారు.
గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సక్సెస్ టూర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ క్రిష్ తోపాటు హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రాగ్య జైస్వాల్ కూడా ఈ సక్సెస్ టూర్ లో పాల్గొంటోంది. అంతే కాకుండా వీక్ డేస్ లో ఈ సక్సెస్ టూర్ వలన అనుకున్న దానికంటే బెటర్ గా కలెక్షన్స్ వస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ మరియు అభినందనలతో వరుణ్ తేజ్ మరియు క్రిష్ లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వారమంతా పలు ప్రాంతాల్లో ఈ సక్సెస్ టూర్ జరగనుంది.


