రాజమౌళితో సినిమా గురించి మహేష్..!

Mahesh-rajamouli
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దానికి ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తనదైన యాక్టింగ్, మ్యానరిజమ్స్‌తో అలరించే సూపర్ స్టార్‌ ఒకవైపు, భారతదేశం గర్వించదగ్గ సినిమా తీశారంటూ కితాబులందుకున్న దర్శకుడు మరోవైపు.. వినడానికే అద్భుతంగా ఉన్న ఈ కాంబినేషన్ త్వరలోనే వర్కవుట్ అవనున్న విషయం తెలిసిందే! ఈ విషయమై రాజమౌళి ఇంతకుముందే ప్రస్తావిస్తూ.. మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు ఎప్పుడో సిద్ధమైపోయానని, త్వరలోనే ఆ సినిమా ఉంటుందని చెప్పేశారు.

తాజాగా ఈ కాంబినేషన్ గురించి మహేష్ బాబు ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. “రాజమౌళి గారితో ఓ సినిమా చేసేందుకు ఇంతకుముందే ప్లాన్ చేశాం. స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ కాంబినేషన్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ తెలిపారు. రాజమౌళి, మహేష్ కలిస్తే ఏ స్థాయి క్రేజ్ ఉంటుంది? అన్న ప్రశ్నకు నవ్వుతూ.. “అది మీరే చెప్పాలి..” అంటూ మహేష్ సెలవిచ్చారు. ‘బాహుబలి-2’ పూర్తయ్యాక మహేష్-రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే!

Exit mobile version