తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటే అభిమానించి ఆరాదించే అభిమానులు కోకొల్లలు ఉంటారు. కానీ ఆయన మాత్రం చాలా అరుదుగా బయటకి రావడం లేదా సినిమా విడుదల సమయంలో మాత్రమే అభిమానులకు దర్శనం ఇస్తుంటారు. అలాంటి రజినీకాంత్ ఇక నుంచి ఎల్లప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉండనున్నారు. ఎలా అనుకుంటున్నారా?
ఆయన ఇప్పుడు సోషల్ నెట్వర్క్ లో కీలక పాత్ర పోషిస్తున్న ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. మీరు కూడా ఆయన చెప్పే విషయాలను తెలుసుకోవాలంటే @superstarrajini అనే ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అవ్వండి. ఇక నుంచి తన అభిమానులు ఆయనతో ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండవచ్చు. అలాగే ఆయన కూడా ఇక నుంచి ఈ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో కాంటాక్ట్ లో ఉండనున్నారు.
మరికెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా సూపర్ స్టార్ ని ఫాలో అయ్యి ఆయన చెప్పే విషయాలను తెలుసుకోండి..


