గ్యాప్ ఇవ్వొద్దు అంటున్న సూపర్ స్టార్ !

Published on Mar 8, 2021 2:35 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ మధ్య షూటింగ్ చేస్తూ ఆసుపత్రిలో జాయిన్ అయి అటు నుండి ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రజిని మళ్ళీ షూట్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. త్వరలో షూటింగ్ పెట్టుకుందామని మేకర్స్ కి రజిని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడట. కాగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ఇంటర్వెల్ సీన్స్ ను ముందుగా షూట్ చేస్తారట.

అలాగే ఇక నుండి షూటింగ్ కి గ్యాప్ రాకుండా బ్యాలెన్స్ పార్ట్ మొత్తం వరుస షెడ్యూల్స్ లో ప్లాన్ చేయమని రజిని ఇప్పటికే డైరెక్టర్ కి చెప్పాడట. ఇక ఇంటర్వెల్ సీన్స్ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :