యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది మిల్క్ బ్యూటీ సురభి. పాలరాతి శిల్పం లాంటి ఈ అందగత్తె ఇటివలే విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘రఘువరన్ బిటెక్’లో అతిధి పాత్రలో మెరిసింది. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘బీరువా’ సినిమా పట్ల ఆమె సంతోషంగా ఉంది. తెలుగు సినిమాలలో నటించడానికి, మంచి అవకాశాలు సొంతం చేసుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. ‘బీరువా’ సినిమా విడుదలైన తర్వాత భవిష్యత్ సినిమాలపై ఓ నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది.
తమిళంలో విక్రమ్ ప్రభు నటించిన ‘ఇవన్ వెరమతిరి’ సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టిన సురభి, మొదట ఢిల్లీలో నటనలో శిక్షణ పొందింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో పాటు జాయ్ అల్లుకాస్ ఆభరణాల ప్రకటనలో సైతం నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వాతావరణం తనను బాగా నచ్చిందని సురభి చెప్పారు. ‘బీరువా’ సినిమాలో నటించడాన్ని బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఉషా కిరణ్ మూవీస్ మరియు ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కన్మణి ఈ సినిమాకు దర్శకుడు.


