NBK 111: గోపీచంద్, థమన్ ల స్యూర్ షాట్ హిట్ ట్రీట్!

NBK 111: గోపీచంద్, థమన్ ల స్యూర్ షాట్ హిట్ ట్రీట్!

Published on Jun 9, 2026 1:55 PM IST

NBK111

ఇప్పుడు మన తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం కూడా ఒకటి. బాలయ్య కెరీర్ 111వ సినిమాగా అనౌన్స్ చేసి ఇప్పుడు దీనిని ప్రమోట్ చేస్తున్న తీరుతోనే భారీ హైప్ ని సెట్ చేసుకుంది.

ఇలా రేపు బాలయ్య పుట్టినరోజు కానుకగా మేకర్స్ సాలిడ్ ట్రీట్ ని అందించనుండగా ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ ప్రామిస్ ఇస్తున్నారు. థమన్, అలాగే గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు అంటూ రేపు రానున్న వీడియో ట్రీట్ పై మరింత హైప్ ఎక్కిస్తున్నారు. దీనితో ఈసారి థమన్ ఇచ్చే సౌండింగ్, గోపీచంద్ ప్రెజెంటేషన్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు