టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకరైన సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’, ‘కిక్’, ‘ఊసరవెళ్లి’, ‘రేసుగుర్రం’ లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. తన కెరీర్లో ఓ క్రేజీ ఫిల్మ్ గా చెప్పుకునే కిక్ సినిమాకి సీక్వెల్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసిన సినిమా ‘కిక్ 2’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. కిక్ సినిమాకి ఉన్న క్రేజ్ వలన ఈ సినిమాకి ప్రేక్షకులు క్యూ కట్టారు. అలాగే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా సుమారు 15-16 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా కిక్ 2 నిలిచింది.
ఈ సినిమా సక్సెస్ విషయంలో, సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి సురేందర్ రెడ్డి చాలా థ్రిల్ అయ్యాడు. కిక్ 2 సినిమాని తన రెగ్యులర్ ఫార్మాట్ కంటే కాస్త డిఫరెంట్ గా ఉండేలా అటెంప్ట్ చేసాడు. అయినప్పటికి సినిమాకి మంచి రెస్పాన్స్ తో పాటు ఓపెనింగ్స్ కూడా వస్తుండడంతో సురేందర్ రెడ్డి థ్రిల్ అవ్వడమే కాకుండా చాలా హ్యాపీగా ఉన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్.టి.అర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. చాలా రిచ్ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.


