‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. ఇప్పటికే శ్రీను వైట్ల సినిమాకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాము. ఈ సినిమా జనవరి 28న లాంచనంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మరో క్రీజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ సినిమా కూడా 2015లో సెట్స్ పైకి వెళ్తుంది.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి కిక్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ కూడా శ్రీను వైట్ల ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. ఇది కాకుండా కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి రాసిన ఓ కథకి కూడా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కి ఓ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడని కోన వెంకట్ తెలిపాడు. ఇవన్నీ కాకుండా రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ఓ సినిమా చేయడానికి సముఖతగా ఉన్నాడు. మరి ఏయే సినిమాలు సెట్స్ మీదకి వెళ్తాయి అనే దానికోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..


