‘దృశ్యం’ విడుదల వెనుక సురేష్ బాబు మాస్టర్ మైండ్..!

‘దృశ్యం’ విడుదల వెనుక సురేష్ బాబు మాస్టర్ మైండ్..!

Published on Jul 21, 2014 5:55 PM IST

Suresh-Babu
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమా విడుదలై 10 రోజులు గడిచినా థియేటర్ల వద్ద సందడి ఏమాత్రం తగ్గలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు వెంకి నటనను. కథను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. మొదట ఈ చిత్రాన్ని తక్కువ థియేటర్లలో విడుదల చేయడం పట్ల కొందరు విమర్శించారు. అయితే పక్కా ప్రణాళికతోనే తాము సినిమాను విడుదల చేశామని నిర్మాత సురేష్ బాబు చెప్తున్నారు.

‘దృశ్యం’ సినిమా తెలుగులో డిఫరెంట్ జోనర్ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ప్రస్తుతం కుటుంబ కదాచిత్రలకు ఆదరణ తగ్గింది. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమాలు అరుదుగా వస్తున్నాయి. ‘దృశ్యం’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం అంతా కలసి చూసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ ధియేటర్లకు రావడానికి కొంచం టైం పడుతుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ కావాలి. ఎక్కువ ధియేటర్లలో విడుదల చేయడం వలన కలెక్షన్స్ రాలేదు, హిట్ కాదు అనే మాటలు వినిపిస్తాయి. అందుకే తక్కువ థియేటర్లలో విడుదల చేసి ఎక్కువ రోజులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని సురేష్ బాబు చెప్పారు. ఇటివల విడుదలైన సినిమాలలో ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.

తాజా వార్తలు