ఇంటర్వ్యూ: సురేష్ బాబు – ఒత్తిడి నా మీద కాదు తరుణ్ భాస్కర్ మీద ఉంది !

ఇంటర్వ్యూ: సురేష్ బాబు – ఒత్తిడి నా మీద కాదు తరుణ్ భాస్కర్ మీద ఉంది !

Published on Jun 22, 2018 5:55 PM IST

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ నెల 29న చిత్రం విడుదల సందర్బంగా సురేష్ బాబుగారు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

తరుణ్ భాస్కర్ లో మీకు బాగా నచ్చిన అంశం ?
అతనికి గొప్ప టాలెంట్ ఉంది. తెలుగు పరిశ్రమలో అతనొక సంచలనం అవుతాడు. క్రమశిక్షణతో పనిచేస్తే అనేక జానర్లలో సినిమాలు చేసి అన్ని వర్గాల వారిని మెప్పించగలడు.

‘పెళ్లి చూపులు’ మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయడంలో ఎలాంటి కష్టం అనిపించింది ?
ఇక్కడ ఒత్తిడి నా మీద కాదు తరుణ్ మీద ఉంది. తను ఒక్క సినిమా వండర్ కాదని అతనే నిరూపించుకోవాలి. అతనితో సినిమా చేయాలనీ చాలా మంది పెద్ద హీరోలు అనుకున్నారు. కానీ ఆతను మాత్రం చిన్న సినిమానే ఎంచుకున్నారు. అందుకే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

అతను సినిమా ఎలా తీశాడని అనుకుంటున్నారు ?
సినిమా మొత్తం ఎప్పుడూ కలిసింది జాలీగా ఎంజాయ్ చేసే కొంతమంది స్నేహితుల గురించి. తరుణ్ మంచి సంభాషణలను వాటికి తోడు మంచి ఎమోషన్స్ ను ఉండేలా డైరెక్ట్ చేశాడు. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాతో కనెక్ట్ అవుతారని నా నమ్మకం.

సాంకేతికంగా ఈ సినిమాలో కొత్తవి ఏం చూడొచ్చు ?
సినిమా మొత్తాన్ని సింక్ సౌండ్ లో చిత్రికరించారు. భవిష్యత్తులో ఈ ప్రయోగం ట్రెండ్ గా మారిపోతుంది. అతను, అతని టీమ్ పని చేసిన విధానాన్ని సెట్స్ లో దగ్గరుండి చూశాను. చాలా బాగా చేశారు.

పరిశ్రమ పరిధి ఎలా పెరుగుతోందని అనుకుంటున్నారు ?
పరిస్థితులు చాలా త్వరగా మారిపోతున్నాయి. వాటిని అందుకోవాలి. సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా మంచి సినిమాలు నిర్మిస్తే మనం హాలీవుడ్ పరిశ్రమకు తక్కువేం కాదు. మంచి స్థాయిని అందుకోవాలంటే మంచి సినిమాలు తీయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు