‘చరణ్ – శంకర్’ సినిమాలో ఆయన అవినీతికి ప్రతిరూపం !

Published on Oct 25, 2021 6:20 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో సీనియర్ హీరో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళ హీరో సురేష్ గోపి ఈ చిత్రంలో ఓ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ‘సురేష్ గోపి’ది ఓ పొలిటీషియన్ పాత్ర అని, అవినీతికి ప్రతిరూపం లాంటి పాత్రలో ఆయన నటించబోతున్నాడని తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. సురేష్ గోపి పాత్రకు భార్యగా ఇషా గుప్తా నటిస్తోందట. అన్నట్టు ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అయితే, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :

More