‘రాముడు భీముడు’ టైటిల్ ని రిజిస్టర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్

‘రాముడు భీముడు’ టైటిల్ ని రిజిస్టర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్

Published on Feb 13, 2013 1:20 PM IST

Ramudu-Bheemudu-Title

ఫిల్మ్ ఛాంబర్ లో ‘రాముడు భీముడు’ అనే సినిమా టైటిల్ ని రిజిస్టర్ అయ్యింది. ఈ టైటిల్ ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మూవీ మొఘుల్ డాక్టర్ డి.రామానాయుడు గారు రిజిస్టర్ చేయించారు. 1964లో వచ్చిన ‘రాముడు భీముడు’ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో సీనియర్ ఎన్.టి.అర్. ద్విపాత్రబినయం చేశారు. కొంతకాలం నుండి ఫిల్మ్ నగర్లో జూనియర్ ఎన్.టి.అర్ తో ఈ సినిమాను రీమేక్ చేయవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు అధికారికంగా తెలియజేయలేదు. కానీ ఇలా టైటిల్ ని నమోదు చేసుకోవడంతో అందరిలోనూ ఒక ప్రశ్నని రేకెత్తిస్తోంది అదేమిటంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా? దీనిపై మరిన్ని వివరాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు