విజయ్ సూపర్ హిట్ ట్రాక్ కు రైనా స్టెప్స్.!

Published on Mar 9, 2021 10:01 am IST

ఇటీవల కాలంలో సంగీత ప్రియులను ఓ రేంజ్ లో ఊపేసిన కొన్ని సూపర్ డూపర్ హిట్ ట్రాక్స్ లో ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” చిత్రంలో వాతి కమింగ్ కూడా ఒకటి. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ ఇచ్చిన ఈ సాంగ్ ఎన్ని రికార్డ్స్ సెట్ చేసిందో తెలిసిందే. అప్పుడు లిరికల్ సాంగ్ నుంచి ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ వరకు కూడా భారీ వ్యూస్ తో దూసుకెళ్తుంది.

అలా దీని ఎఫెక్ట్ మన ఇండియన్ టీం క్రికెట్ ప్లేయర్స్ వరకు కూడా గట్టిగానే వెళ్ళింది. ఆ మధ్య అశ్విన్, హార్దిక్ పాండ్య సహా కుల్దీప్ యాదవ్ లు స్టెప్పులు వేశారు. అప్పుడే ఆ వీడియో వైరల్ కాగా ఇప్పుడు ఇదే సాంగ్ కు ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా స్టెప్స్ వేసాడు. తమిళ నాట ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన రైనా విజయ్ సాంగ్ కు లైట్ గా అలా స్టెప్స్ వేసాడు. దీనితో వీడియో ఓపక్క ఐపీఎల్ ఫ్యాన్స్ లో మరియు సినీ వర్గాల్లో మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :