స్టార్ హీరో సినిమా షూటింగ్ రాజమండ్రిలో !

Published on Aug 22, 2018 4:59 pm IST


తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 36వ చిత్రం’ఎన్జికె’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కోవూరు లోని మాధ మెడికల్ కాలేజ్ లో జరుసుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ రాజమండ్రి కి వెళ్లనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తెరక్కించిన తరువాత తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ కు రానున్నారు.

విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం ఫై నిర్మిస్తున్నారు. తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి దీపావళికి విడుదల కానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :

X