రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సూర్య సినిమా

Published on Jun 26, 2021 2:02 am IST

స్టార్ హీరో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ ఉత్సాహంలోనే సూర్య పలు కొత్త సినిమాలను స్టార్ట్ చేశారు. వాటిలో పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడ ఒకటి. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాక్ డౌన్ మూలంగా ఆగిపోయిన చిత్రీకరణను త్వరలోనే రీస్టార్ట్ చేయనున్నారు. కథ విషయానికి వస్తే ఇదొక రియల్ ఇన్సిడెంట్ చుట్టూ జరిగే కథ అని తెలుస్తోంది. పొల్లాచ్చిలో జరిగిన ఇక భయంకరమైన ఘటన ఆధారంగా ఈ కథను రాశారట.

ఇందులో సూర్య మహిళలకు అండగా నిలబడే పాత్రలో కనిపిస్తారట. దర్శకుడు పాండిరాజ్ రియల్ ఇన్సిడెంట్లోని యాధార్థ ఘటనలకు సన్నివేశాలుగా తెరకెక్కించారట. జూలై మొదటి వారం నుండి షూటింగ్ మొదలుకానుంది. ఇందులో ప్రియాంక మోహన్, సత్యరాజ్, శరణ్య పొనవన్నన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ సీజేసి యోచనలో ఉన్నారు టీమ్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇది కాకుండా సూర్య ఇంకో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు.

సంబంధిత సమాచారం :