నాశిక్‌లో ’24’ కోసం సూర్య-సమంత బిజీ!

surya-samantha
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకోగా, ‘రాక్షసుడు’ కోసం సూర్య ’24’ సినిమాకు కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు రాక్షసుడు కూడా విడుదలైపోవడంతో 24 సినిమాను మళ్ళీ మొదలుపెట్టేశారు.

’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్‌ కథతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాశిక్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరో హీరోయిన్లు సూర్య, సమంతలు పాల్గొంటుండగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ’24’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version