పోలండ్‌లో సూర్య, సమంతల ’24’!

suriya
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’.. ఇలా సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో ట్రెండ్ సృష్టించిన విక్రమ్ కుమార్, 24 సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య తన సొంత 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక గత కొన్ని నెలలుగా ముంబైలో భారీ షెడ్యూల్‌ను జరుపుతూ వచ్చిన యూనిట్, ఈమధ్యే ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసి పోలండ్‌కి షిఫ్ట్ అయింది.

ప్రస్తుతం పోలండ్‌లో హీరో హీరోయిన్లు సూర్య, సమంతలు పాల్గొంటుండగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుమారు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌ సన్నివేశాలు చాలా ఉంటాయని, ఈ సన్నివేశాలన్నింటినీ క్వాలిటీగా రూపొందించాలన్న ఆలోచనలో విక్రమ్ కుమార్ సినిమాను పొంగల్ రేస్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 2016సమ్మర్ కానుకగా పెద్ద ఎత్తున ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో హీరో నితిన్ ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

Exit mobile version