సూర్య ముఖ్య అతిథిగా కార్తి సినిమా ఆడియో వేడుక !
Published on Jun 14, 2018 3:47 pm IST

తెలుగునాట ఫాలోయింగ్ కలిగిన కొద్దిమంది తమిళ హీరోల్లో కార్తి కూడ ఒకరు. ‘ఆవారా, నా పేరు శివ’ వంటి చిత్రాలతో తెలుగులో సక్సెస్ అందుకున్న ఈ హీరో తన ప్రతి సినిమాను తమిళంతో పాటే తెలుగులో కూడ ఏకకాలంలో విడుదలచేస్తూ వచ్చారు. ఆయన తాజా చిత్రం ‘కడైకుట్టి సింగం’ కూడ తెలుగులో ‘చినబాబు’ పేరుతో విడుదలకానుంది.

ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 23న తెలుగు ఆడియో వేడుకను హైదరాబాద్లో ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకు కార్తి సోదరుడు, స్టార్ హీరో సూర్య ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. కార్తి సరసన సాయేషా కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook