
స్వతహాగా తమిళ హీరో కానీ తను చేసే డిఫరెంట్ సినిమాలతో తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య. సౌత్ లో సూర్యకి అప్పటి వరకూ ఉన్న క్రేజ్ ని డబుల్ చేసిన సినిమా ‘సింగం’. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సూర్య సౌత్ ఇండియాలో ఓ సరికొత్త రికార్డ్ ని సృష్టించాడు. అదే సింగం సీరీస్ కి మూడవ పార్ట్ కి సంబందించిన షూటింగ్ ని త్వరలోనే మొదలు పెట్టనున్నారు. సౌత్ ఇండియాలో మొదటి సారిగా వస్తున్న ట్రైలాజీ సింగం కావడం విశేషం.
ఇప్పటి వరకూ హాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే ట్రైలాజీ పార్ట్స్ వచ్చాయి. కానీ సౌత్ లో మాత్రం రాలేదు. మొదటి సారిగా చేస్తున్న ట్రైలాజీతో సూర్య అరుదైన రికార్డ్ ని సృష్టించాడు. మాస్ మసాల ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన హరి ఈ ట్రైలాజీకి డైరెక్టర్. మొదటి రెండు పార్ట్స్ లో హీరోయిన్ గా కనిపించిన అనుష్క మూడవ పార్ట్ లోనూ హీరోయిన్ గా కనిపించనుంది. అనుష్కతో పాటు శృతి హాసన్ కూడా మూడవ పార్ట్ లో హీరోయిన్ గా కనిపించనుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్.