25 లక్షలు విరాళంగా ఇచ్చిన సూర్య

25 లక్షలు విరాళంగా ఇచ్చిన సూర్య

Published on Nov 28, 2015 4:58 PM IST

surya-donete
తమిళంలో టాప్ హీరోల్లో ఒకరైన సూర్యకు తెలుగులోనూ ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోగా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న సూర్య, నిజ జీవితంలోనూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ రియల్ లైఫ్ హీరో అని కూడా అనిపించుకున్నారు. తాజాగా ఆయన తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.

గత కొద్దిరోజులుగా చెన్నైలో విపరీతమైన వర్షాల వల్ల వరదలతో ఎంతో మంది నిరాశ్రయులు కూడా అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వరదల వల్ల ఇబ్బందులకు గురైన ప్రజల సహాయార్థం ప్రభుత్వంతో పాటు పలు ఇతర స్వచ్చంద సంస్థలు కూడా సహయ చర్యల్లో లీనమయ్యాయి. ఇక ఈ సహయ కార్యక్రమాలకు చేయూతగా నిలుస్తూ సూర్య 25 లక్షల రూపాయల చెక్‌ను నడిగర్ సంఘం తరపున సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం సూర్య ఇలా తనవంతుగా ముందుకు వచ్చి ఇంత మొత్తం అందజేయడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు