తమిళ ఇండస్ట్రీలో నటన అంటే ఎంత వరకు అయినా వెళ్లగలిగే హీరోలలో సూర్య కూడా ఒకరు. విభిన్నమైన సబ్జెక్టులను ఎంచుకొంటూ ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సూర్య సొంతం చేసుకున్నారు. అయితే ఈరోజుతో సూర్య ఇండస్ట్రీకు వచ్చి 23 ఏళ్ళు కావడంతో సూర్య అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ట్రెండ్ లో ఒక ఆశ్చర్యకరమైన ఫోటో కనిపించింది.
అయితే ఏ హీరో అభిమానులు అయినా సరే తమను ఎంటర్టైన్ చెయ్యడానికి అలాంటి సినిమాలు చెయ్యాలని ఇలాంటి సినిమాలు చెయ్యమని కోరుకుంటారు. కానీ సూర్య అభిమానులు కోరిన కోరిక మాత్రం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక మీరు సినిమాలు చెయ్యొద్దని అవి ఆపి రాజకీయాల్లోకి రావాలని ఫ్లెక్సీ పెట్టి మరీ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఫోటోనే సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యిపోతుంది. ప్రస్తుతం సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దురా” చిత్రం వచ్చే అక్టోబర్ లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
