క్రేజీ రీమేక్ లో స్టార్ బ్రదర్స్ ..!

Published on May 28, 2020 11:38 pm IST

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పై అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో ఈ మూవీ రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఇక బాలయ్య, రానా వంటి హీరోల పేర్లు ఈ రీమేక్ కొరకు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను హీరో సూర్య దక్కించుకున్నారట . తమ్ముడు కార్తితో కలిసి ఆయన ఈ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే సూర్య ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. గతంలో సూర్య, కార్తీ కలిసి ఓ మూవీ చేసిన దాఖలాలు లేవు. అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీతోనే ఇది సాకారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో సురారై పోట్రు మూవీ చేస్తున్నారు. ఇక కార్తీ మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పొన్ని యెన్ సెల్వన్ మూవీతో పాటు సుల్తాన్ అనే మరో చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More