సూర్య ”ఎన్ జీ కే’ లేటెస్ట్ అప్డేట్ !

సూర్య ”ఎన్ జీ కే’ లేటెస్ట్ అప్డేట్ !

Published on Oct 18, 2018 12:46 AM IST


తమిళ స్టార్ హీరో సూర్య – సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న’ఎన్ జీ కే’ చిత్రం యొక్కచివరి షెడ్యూల్ షూటింగ్ నవంబర్ లో జరుగనుంది. దాంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఇక తమిళ సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 28 విడుదల చేయాలనీ భావిస్తున్నారట. నిజానికి దీపావళికి విడుదుల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఈ చిత్రంలోసూర్య రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనుండగా ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇక సూర్య నటిస్తున్న 37వ చిత్రం రెండవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ , ఆర్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు