పవర్ ఫుల్ వకీల్ గా మారిన సూర్య.!

Published on May 7, 2021 1:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన సూర్య శివకుమార్ కు మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరిసూర్య ఇటీవల “ఆకాశం నీ హద్దురా” తో భారీ విజయాన్ని సొంతం చేసుకోడమే కాకుండా మంచి కం బ్యాక్ కూడా అందుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత సూర్య నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లను అంతా ఆశిస్తున్నా క్రమంలో రెండు పవర్ ఫుల్ సబ్జెక్ట్ లను సూర్య టేకప్ చేసాడు.

మరి వాటిలో దర్శకుడు టి జె జ్ఞానవేల్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో సూర్య పవర్ ఫుల్ వకీల్ సాబ్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. లాయర్ గెటప్ లో ఉన్న ఆన్ లొకేషన్ ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మన సౌత్ ఇండియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ తో మాస్ లాయర్ ఎలా ఉంటాడో చూపించారు. మరి ఈ సూర్య సినిమా ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :