సూర్య సినిమాకు రిలీజ్ సమయం దొరికిందా.?

Published on Oct 24, 2020 3:03 pm IST

కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలలో మోస్ట్ లవబుల్ స్టార్ హీరోలలో జీరో పర్సెంట్ హేటర్స్ తో ఎవరన్నా ఉన్నారంటే అది సూర్య అనే చెప్పాలి. సూర్య సినిమాలను అక్కడేంతలా ఆదరిస్తారో మన దగ్గర కూడా అదే రీతిలో మన వాళ్ళు కూడా ఆదరిస్తారు.

అయితే ఇప్పుడు సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశమే నీ హద్దురా” గత కొన్నాళ్ల నుంచి విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవితంపై రాసిన “సింప్లీ ఫ్లై” పుస్తకం ఆధారంగా సుధా కొంగర ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.

భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం దురదృష్టవశాత్తు థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. దీనితో నేరుగా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ అక్టోబర్ 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సింది కూడా భారత నావికా దళం నుంచి రావాల్సిన ఎన్ ఓ సి కారణంగా వాయిదా పడాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ కు భారత నావికా దళం నుంచి ఎన్ ఓ సి పాస్ అయ్యినట్టుగా తెలుస్తుంది. వారు మేకర్స్ కు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రెండు భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చెయ్యొచ్చని అంగీకరించారట.

దీనితో ఇపుడు చిత్ర యూనిట్ వచ్చే దీపావళి సీజన్ కు ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ కొద్ది లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More