సూర్య “జై భీమ్” చిత్రానికి అరుదైన గౌరవం.!

Published on Dec 4, 2021 8:17 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ ఓటిటి బ్లాక్ బస్టర్ చిత్రం “జై భీమ్”. నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు జ్ఞ్యానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రం నేరుగా ఓటిటి లోనే రిలీజ్ అయ్యి అన్ని వర్గాల నుంచి సాలిడ్ రిపోర్ట్స్ అందుకుంది. తన గత చిత్రం ఆకాశం నీ హద్దురా సినిమా అనుకుంటే ఇది దానిని మించి మంచి ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా మంచి రేటింగ్స్ అందుకొని ఆశ్చర్యపరిచింది.

అయితే ఈ చిత్రానికి కూడా మరో అరుదైన గౌరవం దక్కింది. 2022 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యి ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఈ చిత్రం బెస్ట్ నాన్ ఇంగ్లీష్ భాషా చిత్రంగా నామినేట్ అయ్యింది. సూర్య గత సినిమా ఆకాశం నీ హద్దురా కూడా ఇలాంటి అరుదైన ఫీట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇలా ఎంపిక కావడంతో సూర్య అభిమానులు మరింత ఆనందం, గౌరవం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :