అంజాన్ లో సమంతా, సూర్య జోడికి మంచి రెస్పాన్స్

అంజాన్ లో సమంతా, సూర్య జోడికి మంచి రెస్పాన్స్

Published on May 1, 2014 2:37 AM IST

Anjaan
సూర్య, సమంతా జంటగా నటిస్తున్న అంజాన్ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈ రోజు ట్విట్టర్ లో విడుదల చేశారు. ఆన్ స్క్రీన్ పై ఉన్న ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని, యుటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కుడి వైపు టైటిల్ పోస్టర్ పై ఉన్న సూర్య, సమంతా జంటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సంతోష్ శివన్ యొక్క సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఈ అన్ని విషయాలు చూస్తుంటే అంజాన్ సినిమా సూర్య, సమంతా అభిమానులకు కన్నుల పండుగ కలిగించేలా ఉంది. ఈ చిత్రంలో సూర్య ఓ గ్యాంగ్ స్టర్ గా, సమంతా ప్రియురాలుగా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు