ఏప్రిల్ నుండి మొదలుకానున్న సూర్య – విక్రమ్ ల సినిమా

ఏప్రిల్ నుండి మొదలుకానున్న సూర్య – విక్రమ్ ల సినిమా

Published on Feb 18, 2015 2:27 AM IST

Surya_Vikram
‘మనం’ సినిమాతో మనందరి మన్నలని పొందిన దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ప్రారంభోత్సవ పనులలో బిజీగా వున్నాడు. తమిళనాట రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ లో సూర్య హీరో. థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతుందని, దీని టైటిల్ ’24’ అని సమాచారం. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్ లో నిర్మించనున్నారు. ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురి పేర్లు పరిశీలించినా తన ఖాతాలో బ్లాక్ బస్టర్ నమోదుకి ఒకానొక కారణమైన సమంతాని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.

ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు