కోలీవుడ్ స్టార్ హీరో ది వన్ సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామానే విశ్వనాథ్ అండ్ సన్స్. క్లాస్ సినిమాగా వచ్చి సూర్య కెరీర్లో రెండో అతిపెద్ద గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీ లోకి కూడా రాగా ఇక్కడా భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది.
కేవలం మూడే రోజుల్లో 5.5 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి సౌత్ ఓటీటీ దగ్గర క్రేజీ రికార్డ్ సాధించింది. ఇక అంతేకాకుండా గ్లోబల్ ఛార్ట్స్ లో కూడా సినిమా షైన్ అయ్యింది. గ్లోబల్ గా నాన్ ఇంగ్లీష్ ట్రెండింగ్ లిస్ట్ లో ప్రస్తుతం టాప్ 3 లో ఈ సినిమా ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. దీనితో కేవలం థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి హిట్ రెస్పాన్స్ అందుకుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అలాగే నాగవంశీ, సాయి సౌజన్యా లు నిర్మాణం వహించారు.


