సంక్రాంతినే టార్గెట్ చేస్తున్న సూర్య

surya
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సూర్య. ప్రస్తుతం సూర్య విభిన్న తరహా సినిమాలు చేసే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పూణేలో జరుగుతోంది. సూర్యతో పాటు ఇతర తారాగణం కూడా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నవంబర్ మొదటి వారం కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నరు.

ఈ సినిమాని సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇది కాకుండా సూర్య నటిస్తూ తన సొంత బ్యానర్ లో పసంగ 2 అనే సినిమాని కూడా నిర్మించాడు. ఈ సినిమా రిలీజ్ తెలియక ఇన్ని రోజులు ’24’ని సంక్రాంతికి రిలీజ్ చేయాలా లేక సమ్మర్ కి రిలీజ్ చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ పసంగ 2 సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయనుండడంతో సూర్య తన 24 సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇదే టార్గెట్ తో ఈ చిత్ర టీం వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ చిత్ర టీం ఇప్పటికే విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ అయ్యిందని సమాచారం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని నితిన్ దక్కించుకున్నాడు.

Exit mobile version