మహేష్ కాదన్న కథే.. సూర్య క్రేజీ సినిమా!

మహేష్ కాదన్న కథే.. సూర్య క్రేజీ సినిమా!

Published on Nov 25, 2015 7:20 PM IST

surya-mahesh-babu
తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా నటించడంతో పాటు స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మించిన సినిమా ’24’. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన వినూత్న సినిమా కావడంతో ’24’ సినిమాకు తెలుగు, తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసేలా నిన్న విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికర కథనం ప్రస్తుతం బాగా హల్‌చల్ చేస్తోంది. నిజానికి ’24’ సినిమా కథను దర్శకుడు విక్రమ్ కుమార్ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారట. ఆయన కూడా ఈ కథను మెచ్చుకొని, సెకండాఫ్ విషయంలో తనకు సెట్ అయ్యే కథనం కాకపోవడంతో వెనుకడుగు వేశారట. దీంతో ఇదే కథను సూర్యకు వినిపించగా ఆయన దీన్ని వెంటనే ఓకే చేసి స్వయంగా తన బ్యానర్‌లోనే చేద్దామని విక్రమ్‌ను ప్రోత్సాహించడంతో ’24’ మొదలైంది. సూర్య సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో సూర్య త్రిపాత్రాభినయం చేశారు. తెలుగులో ఈ సినిమాను స్టార్ హీరో నితిన్ విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు