సూర్య నటించిన రాక్షసుడు సినిమా ఆశించినంత ప్రేక్షకాదరణ లభించని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ తమిళ స్టార్ మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. చిన్నారుల నేపధ్యంలో సాగే ఒక చిత్రంలో సూర్య అతిధిపాత్ర చేయనున్నాడు. పాండిరాజ్ దర్శకుడు. సూర్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘హైకూ’ అనే ఈ చిత్రంలో అమలాపాల్ కూడా తళుక్కున మెరవనుంది.
ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ లను గత నెల విడుదలచేసారు. ఈ సినిమాలో సూర్య ఒక సామాజిక సేవ చేసే యువకుడిగా, అమలా పాల్ ఉపాధ్యాయనిగా నటించారు. కార్తీక్ కుమార్, బిందు మాధవి కూడా చిత్రంలో భాగమయ్యారు.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో భారీ విడుదలకు సిద్ధంకానున్నారు. చిత్ర విడుదలతేదిని స్వయంగా సూర్య ప్రకటించనున్నారు.


