వైరల్: సూపర్ స్టైలిష్ గా మారిన సూర్య!

వైరల్: సూపర్ స్టైలిష్ గా మారిన సూర్య!

Published on Jul 10, 2024 2:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తరువాత సూర్య చేయబోయే ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తో సూర్య ఒక చిత్రాన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సూర్య 44 అనే టైటిల్ ను తాత్కాలికంగా పెట్టడం జరిగింది.

అయితే ఈ చిత్రం కోసం హీరో సూర్య సరికొత్త లుక్ లోకి మారిపోయినట్లు తెలుస్తోంది. సర్ఫీర చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ కోసం సూర్య హాజరు అయ్యారు. సూర్య తో పాటుగా ఆయన భార్య జ్యోతిక కూడా హాజరు అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో హీరో సూర్య లుక్ సూపర్ సైలిష్ గా ఉంది. ఈ లుక్ కచ్చితంగా సూర్య 44 కోసమే అని అంతా భావిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు