హిట్ కాంబినేష‌న్‌ను సెట్ చేసుకున్న సూర్య

Published on Mar 2, 2020 12:00 am IST

ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పొట్రు’ అనే సినిమా చేస్తున్న సూర్య తన తదుపరి సినిమాల్ని కూడా ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారు. ఆయన తన 39వ చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కృతమే స్టుడియో గ్రీన్ నిర్మాణ సంస్థ అధికారంగా ప్రకటించింది. సూర్య, హరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ‘ఆరు, సింగం, సింగం, సింగం 2, సింగం 3’లు మంచి విజయాల్ని అందుకున్నాయి.

ఈ సినిమాలతోనే వీరి కాంబినేషన్ పట్ల అభిమానుల్లో ప్రత్యేకత నెలకొంది. ఇప్పుడు సూర్య నెక్స్ట్ చిత్రాన్ని హరి డైరెక్ట్ చేయనున్నారని తెలియడంతో తమిళ ప్రేక్షకుల్లోనే కాదు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రాజెక్ట్ పట్ల అమితాశక్తి మొదలైంది. ఎప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘అరువా’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్, ఇతర తారాగణం ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More