‘సింగం-4’ మొదలుపెట్టే ఆలోచనలో సూర్య

Published on May 25, 2021 1:14 am IST

హీరో సూర్య కెరీర్లోనే భారీ విజయం అందుకుంది ‘సింగం’ సిరీస్. ఈ సిరీస్ నుండి వచ్చిన మూడు చిత్రాలు విజయాలను సాధించాయి. ఈ సిరీస్ దర్శకుడు హరి. సూర్య, హరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో ‘సింగం’ మాత్రమే కాదు ‘ఆరు, వేల్’ లాంటి సినిమాలు కూడ వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. అది కూడ ‘సింగం’ సిరీస్ కోసం. సిరీస్లో నాల్గవ ఇన్స్టాల్మెంట్ చేయనున్నారు. లాక్ డౌన్ మూలంగా సినిమా ప్రారంభం ఆలస్యమైంది.

తాజా సమాచారం మేరకు ఆగష్టు నెల నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట హరి. ఇది కూడ గత మూడు భాగాల తరహాలోనే హై యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో కూడ అనుష్కనే కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే సూర్య ప్రస్తుతం సూర్య పాండిరాజ్, వెట్రిమారన్, జ్ఞానవేల్ లాంటి దర్శకులతో మూడు సినిమాలు చేస్తున్నారు. వీటిలో పాండిరాజ్ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, వెట్రిమారన్ చేస్తున్న ‘వడివాసల్’ జల్లికట్టు నేపథ్యంలో సాగే చిత్రం. ఇక జ్ఞానవేల్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :