‘ఆర్ఆర్ఆర్’ నుండి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ పోస్టర్ !

Published on Apr 13, 2021 1:03 pm IST

‘ఆర్ఆర్ఆర్’… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ మూవీ. కాగా ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ సినిమా నుండి వచ్చిన స్టిల్ చూసి నెటిజన్ల ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. మొత్తానికి ఉగాది పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఫ్యాన్స్ కు ఓ రేంజ్ సర్ ప్రైజ్ అందింది. ఈ పోస్టర్ లో తారక్, చరణ్ ను జనం ఎత్తుకుని పైకి లేపడం, అలాగే ఇద్దరి హీరోల లుక్స్ కూడా పీక్స్ లో ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :