సర్ప్రైజ్: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విశాల్ “రత్నం”

సర్ప్రైజ్: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విశాల్ “రత్నం”

Published on May 23, 2024 7:05 AM IST

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు హరి తెరకెక్కించిన యాక్షన్ కం ఎమోషనల్ డ్రామా చిత్రం “రత్నం”. మరి గత నెల తెలుగు సహా తమిళ్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. మరి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఈ మే 24 నుంచి సినిమా అందుబాటులోకి వస్తుంది అని బజ్ వినిపించింది.

అయితే ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఒక రోజు ముందే అంటే నేటి నుంచే వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఇందులో ట్రై చేయవచ్చు. మరి ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతానికి మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు