‘రంగస్థలం’లో ఆరవ పాట కూడ ఉంది !


రామ్ చరణ్, సమంతలు జోడీగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఇందులోని మూడు పాటలు ‘ఎంత సక్కగున్నావే, రంగ రంగస్థలాన, రంగమ్మ మంగమ్మ’ పాటలు ఇది వరకే విడుదలకాగ ఇంకో రెండు పాటలు ‘ఆ గట్టునుంటావా, జిగేలు రాణి’లు కలుపుకుని మొత్తం ఐదు పాటలతో ఈరోజు ఉదయం జ్యూక్
బాక్స్ విడుదలైంది.

అయితే ఈ సినిమాలో ఆరవ పాట కూడ ఉందట. అది కొంచెం ప్రత్యేకమైన గీతమని, దాన్ని సినిమాలో చూసే ఎంజాయ్ చేయాలని, అందుకే అన్ని పాటలతో కలిపి రిలీజ్ చేయలేదని దర్శకుడు సుకుమార్ అన్నారు. మరి ఈ పాట ఎంత ప్రత్యేకమైనదో తెలియాలంటే మార్చి 30న సినిమా విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే. ఈ పాటలన్నిటికీ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక 18న వైజాగ్లో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.