తమిళ స్టార్ సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్’. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని నెల్లూరు, కృష్ణపట్నం పోర్టులో షూట్ చేసారు. ఈ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న మాస్ టీం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ కోసం మే 1ని ఖరారు చేసారు. సమ్మర్ లో ఫుల్ హాలిడేస్ సీజన్ లో రిలీజ్ చేస్తే సినిమాకి అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. అలాగే మార్చి చివర్లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
యాక్షన్ & సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, ప్రణిత హీరోయిన్లు. ఆల్రెడీ, టాకీ పార్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ మూవీ యూనిట్ బ్యాంకాక్ పయనమవుతారు. అక్కడ సాంగ్స్ షూట్ చేయనున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


