తెలుగులో మెగా హీరోల సరసన ఒక్క సినిమా చేస్తే ఆ హీరోయిన్ కి మరో రెండు అవకాశాలు రావడం గ్యారెంటీ. శృతి హాసన్, తమన్నా వంటి హీరోలు ముగ్గురు మెగా హీరోలతో రొమాన్స్ చేశారు. తమిళంలో మెగా హీరోల తరహాలో తమిళంలో హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు సూర్య & కార్తి బ్రదర్స్. ఒకరితో నటిస్తే, మరొకరి తర్వాత సినిమాలో బెర్త్ కన్ఫర్మ్. హన్సిక, కాజల్ అగర్వాల్, తమన్నాలను ఊదాహరణగా చెప్పుకోవచ్చు.
తాజాగా కార్తి సరసన ‘మద్రాస్’ అనే సినిమాలో నటించింది ‘ఇద్దరమ్మాయిలతో’ ఫేం కాథరిన్ త్రేసా. తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక, సూర్య నెక్స్ట్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది అంటూ చెన్నై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నయట. కాథరిన్ ను కలసిన దర్శకనిర్మాతలు ఇటివలే కథ వినిపించారట. డిస్కషన్స్ లో ఎం జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


