ఆ విషయంలో ఫ్యాన్స్ కి నో చెప్పిన స్టార్ హీరో

Published on Sep 15, 2019 9:26 am IST

హీరో సూర్య ప్రతి విషయం తన ప్రత్యేక చాటుకుంటారు. తన స్టార్ డమ్ ప్రక్కన పెట్టి పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉండే సూర్యకి సామజిక బాధ్యత కూడా ఎక్కువే. సూర్య కుటుంబం పేద పిల్లల కొరకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన స్కూల్ ద్వారా ఉచిత విద్య అందిస్తున్నారు. సూర్య తాజా చిత్రం బందోబస్త్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఓ పిలుపునిచ్చారు. అభిమానులెవరూ తనకు సంబంధించిన బ్యానర్స్ కట్టవద్దని, ఆ డబ్బులతో ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను చేయాల్సిందిగా చెప్పడం జరిగింది.

ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పొలిటికల్ బ్యానర్ కారణంగా ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. బ్యానర్స్ పర్యావరణానికి హానికలిగించడమే కాకూండా, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందుకే హీరో సూర్య ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మరో హీరో అజిత్ అభిమానులు కూడా బ్యానర్స్ కి వెతిరేకంగా అక్కడక్కడా క్యాంపైన్ నోటీసు బోర్డులు పెట్టడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

X
More