యువన్ సంగీతంలో స్టైలిష్ డాన్ పాట..

యువన్ సంగీతంలో స్టైలిష్ డాన్ పాట..

Published on Jul 3, 2014 10:48 AM IST

anjana
యువన్ శంకర్ రాజా సంగీతంలో స్టైలిష్ డాన్ పాట పాడుతున్నాడు. తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్లో తొలిసారిగా ‘అంజాన్’ సినిమా కోసం తనలో గాయకుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. గతంలో సూర్య, తన తమ్ముడు కార్తి నటించిన నెస్ కేఫ్ కాఫీ యాడ్ పాట పాడాడు. సినిమాలో పాడడం మాత్రం ఇదే తొలిసారి. సూర్య మాఫియా డాన్ పాత్రలో రూపొందుతున్న సినిమా ‘అంజాన్’. సమంత గ్లామరస్ లుక్, ‘అంజాన్’ సినిమా స్టిల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు సూర్య పాట సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకువస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

సూర్య సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 75 కోట్ల భారి నిర్మాణవ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు