‘ఆకాశం నీ హద్దురా’ సూర్య ఫస్ట్ లుక్ అదుర్స్.

surya

టాలెంటెడ్ హీరో నేడు సూర్య తన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ తో అభిమానులను పలకరించారు. సురారై పోట్రు గా తమిళంలో వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్ పై బ్లాక్ కలర్ బనియన్ లో గాలిలోకి ఎగురుతున్న సూర్య లుక్ ఆసక్తి రేపేదిలావుంది. ఈ మూవీలో సూర్య విమానం పైలట్ లా కనిపించనున్నారు. ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్ పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. గతంలో ఈమె గురు చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సురారై పోట్రు మూవీలో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. మోహన్ బాబు పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగివుండే అవకాశం కలదు. అపర్ణ బాలమురళి సూర్య కి జంటగా నటిస్తుండగా, జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version