‘సూర్య vs సూర్య’ టీమ్ సెల్ఫీ టూర్!

‘సూర్య vs సూర్య’ టీమ్ సెల్ఫీ టూర్!

Published on Mar 10, 2015 10:42 PM IST

Surya-vs-Surya
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి రెండు వరుస సూపర్ హిట్ల తర్వాత నిఖిల్ హీరోగా హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన సూర్య vs సూర్య… నిజంగానే హ్యాట్రిక్ సినిమాగా నిలిచింది. మొదట సినిమాకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కూడా బాగుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను ఎప్పుడో దాటేసి లాభాల పట్టిందని టాక్. ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. సోమవారం నుండి సినిమా కలెక్షన్లు పడిపోయే అవకాశాన్ని కల్పించకుండా సినిమా టీమ్ చేపట్టిన సెల్ఫీ టూర్ కూడా విజయవంతమైంది.

ఆదివారం రోజున హైద్రాబాద్‌లో మొదలైన సెల్ఫీ టూర్, నిన్న తిరుపతిలో ఉత్సాహవంతంగా నడిచింది. ఇక అక్కణ్ణుంచి తిరుమల చేరుకున్న టీమ్ తిరుమలేషుణ్ణి దర్శనం చేసుకున్నారు. అక్కడే హీరో నిఖిల్, కార్తికేయ దర్శకుడు చందు మొండేటి, నిర్మాత శివకుమార్‌లు తలనీలాలు సమర్పించారు. అక్కణ్ణుంచి నెల్లూరు చేరుకున్న టీమ్‌కు అక్కడి అభిమానులు స్వాగతం పలికారు. సెల్ఫీ టూర్ పేరుతో ఇలా వినూత్న ప్రమోషన్‌తో సినిమాకి మంచి కలెక్షన్లను తెప్పించడంలో టీమ్ విజయవంతమైందనే చెప్పాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు