సినిమాలో మాస్ మెచ్చే ఫైట్స్ ఉండాలి, కామెడీ ఉండాలి అనే ఫార్మాట్ కి దూరంగా వచ్చి సినిమా అంటే ముందు కంటెంట్ లో కొత్తదనం ఉండాలి అని తెలుసుకున్న హీరోలలో యంగ్ హీరో నిఖిల్ ఒకరు. తను ఎంచుకున్న ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాల కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాకుండా ప్రెజెంటేషన్ కూడా ఆడియన్స్ ని మెప్పించడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇదే తరహాలో నిఖిల్ ట్రై చేస్తున్న మరో సినిమా ‘సూర్య vs సూర్య’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ రోజు ఉదయం లాంచ్ చేసారు.
‘సూర్య vs సూర్య’ ఫస్ట్ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వచ్చిన ఈ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన త్రిద చౌదరి హీరోయిన్ గా నటించింది. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మల్కాపురం శివకుమార్ నిర్మాత.
‘సూర్య vs సూర్య ట్రైలర్ కోసమం ఇక్కడ క్లిక్ చేయండి’


