నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న సూర్య 38 !

Published on Aug 15, 2018 7:50 pm IST

‘ఇరుది సూట్రు’ ఫెమ్ సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య తన 38వ చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈచిత్ర షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని సమాచారం. సూర్య సొంత ప్రొడక్షన్స్ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈచిత్రానికి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.

ఇక సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న’ఎన్ జి కె’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం దీపావళికి విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తో పాటు సూర్య కె వి ఆనంద్ దర్శకత్వంలో తన 37 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం యొక్క ఫస్ట్ షెడ్యూల్ లండన్ లో కంప్లీట్ అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More