సూర్య,మోహన్ లాల్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Published on Jun 28, 2019 12:04 pm IST

తమిళ సూపర్ స్టార్ సూర్య కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కాంబినేషన్లో దర్శకుడు కె.వి ఆనంద్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం “కప్పాన్”. ఈ మూవీని తెలుగులో “బందోబస్త్” పేరుతో విడుదల చేస్తున్నారు. మరో హీరో ఆర్య కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. హీరో సూర్య స్పెషల్ కమాండో ఆఫీస్ గా కనిపిస్తుండగా,మోహన్ లాల్ భారత ప్రధాన మంత్రి రోల్ చేస్తున్నారని సమాచారం.

సయేశా హీరోయిన్ గానటిస్తున్న ఈ మూవీలో బోమన్ ఇరాని,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా హీరో కార్తీ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తుండగా,హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More