సూర్య అభిమానుల వెయిటింగ్‌కు తెర!

సూర్య అభిమానుల వెయిటింగ్‌కు తెర!

Published on Apr 25, 2015 7:30 PM IST

mass-shooting
ఎప్పుడూ సరికొత్త కథలతో, విభిన్న గెట‌ప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. ‘గ్యాంబ్లర్'(మంగాత్తా), ‘బిర్యాని’ సినిమాల ద్వారా దర్శకుడుగా తానేంటో నిరూపించుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇక గత అర్థరాత్రి మాస్ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోగా ఇప్పుడు తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య ఆత్మగా కనిపించి భయపెడతాడని సమాచారం. ట్రైలర్‌లో కూడా చివర్లో వచ్చే సూర్య గెటప్ అదుర్స్ అని అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. సూర్య అభిమానులు ఎప్పట్నుంచో ఈ ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురుచూపులకు నిన్నటితో తెరపడింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 15న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

మాస్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు