సూర్య 37 నెక్స్ట్ షెడ్యూల్ వివరాలు !

సూర్య 37 నెక్స్ట్ షెడ్యూల్ వివరాలు !

Published on Jul 14, 2018 9:18 AM IST

Surya1

కె వి ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య తన 37 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల లండన్ లో ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర టీం కొంత విరామం తీసుకొని తరువాతి షెడ్యూల్ కోసం పొల్లాచ్చి కి వెళ్లనుంది . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , హిందీ విలక్షణ నటుడు బోమన్ ఇరానీ మొదలగు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నుండి యువహీరో అల్లు శిరీష్ నటిస్తున్నాడు.

సూర్య సరసన సాయేషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. తమిళ స్టార్ హీరో ఆర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సూర్య ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘చినబాబు’ చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఆయన తమ్ముడు కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకులముందుకు వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు