రియా పై సుశాంత్ తండ్రి కోపంగా ఉన్నాడా?

susghanth riya
సుశాంత్ రాజ్ పుత్ మరణం తరువాత మీడియాలో ప్రముఖంగా వినిపించిన పేర్లలో రియా చక్రవర్తిది ఒకటి. సుశాంత్ చనిపోయేనాటికి రియా చక్రవర్తి సుశాంత్ తో రిలేషన్ ఉంది. ఇక ఆయన మృతి విషయంలో పోలీసులు విచారించిన వ్యక్తులలో రియా చక్రవర్తి కూడా ఉన్నారు. ముంబై పోలీసులు ఆమెను సుధీర్ఘంగా విచారించగా ఆమె పలు కీలక విషయాలు బయటపెట్టారు. ఇక సుశాంత్ చనిపోవడానికి ముందు రియాకు కూడా కాల్ చేయగా, ఆమె ఫోన్ ఎత్తలేదని సమాచారం ఉంది.

కాగా సుశాంత్ తండ్రి గారిని రియా గురించి అడిగితే.. ఆమె ఎవరో నాకు తెలియదు అన్నారు. సుశాంత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంకిత, కృతి సనన్ గురించి స్పందించిన ఆయన రియా గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపలేదు. సుశాంత్ మానసిక వేదనకు రియా ప్రవర్తన కూడా కారణం అని తెలుస్తున్న నేపథ్యంలో ఆమెపై ఆయన కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version